అంతెరుగని ఈ పయనం…

Standard

పగ్గం తెంచుకున్న పసిడెద్దులా
పందెంలో పోటెద్దులా
మది మళ్ళీ మళ్ళీ పరుగులు తీస్తుంది.

తప్పేదో ఒప్పేదో తెలుసుకునే ఆరాటంలో
నిజమేదో అబద్ధమేదో తెలియని ఈ దొంగాటలో
సత్యశోధనకై సాగిపోతానంది

నేనేదో నువ్వేదో వేరు చేయలేని బంధంలో
నిలువునా గోడలెలా పెరిగాయని ప్రశ్నలు వేస్తుంటే
ప్రతి ప్రశ్నకి బదులు వెతికే ప్రయత్నం చేస్తుంది

పారే నదిలా కాలం కరిగిపోతుంటే
జాలువారే నీరై సాగిపోక
ప్రాణం లేని శిలలా అక్కడే నిల్చుని చింతిస్తుంది.

అంతెరుగని ఈ పయనంలో
పరస్పరం విరుద్ధ మార్గాలే కనిపిస్తుంటే
కనిపించని తన దారేదో కనుక్కునే పనిలో పడింది

మనిషి మనిషిని మార్చి చూసే మనుషులతో
మనుగడ భారమనిపించి
మరో లోకంకి మార్గమెతుక్కుంటుంది.

మూగబోతున్న రాగాల్ని మెల్లగా తొక్కేస్తూ
కారే కన్నీటితో దారంతా తడిపేస్తూ
ఎగిరెగిరి పడుతున్న ధూళిని తానే కడిగేస్తుంది

అడ్డొచ్చిన అదృష్టాన్నయినా సరే ఆనందంగా పక్కకి నెట్టేస్తూ
ఆవేశం తోడై అడ్డదిడ్డంగా అడుగులేస్తూ
తిరిగి తిరిగి అలసిపోయి తీరంకోసం వెతుకులాడింది

తోడొచ్చే వారెవరో
సేదతీర్చే గూడేదో
కొంచెమైనా తెలియని అయోమయంలో
కాలమాడే ఆటకి ప్రత్యర్ధై నిల్చుని
పయనించే దారెరుగక పడిగాపులు కాస్తుంది

సద్దన్నమో సల్లపెరుగో ఒక్క ముద్ద తోడైతే
తల్లిని చేరిన దూడలా తరించిపోతానంది
తండ్రి ఒళ్ళో పాపలా మైమరిచి నిద్రిస్తానంది.

100% లవ్

Standard

సముద్రమయినా భూమిపై 70% మాత్రమే నిండి ఉంది
కాని నువు నాలో 100% నిండి వున్నావు.
సూర్యుడైనా రోజులో 12 గంటలే కనిపిస్తాడు
కాని 24 గంటలు నా ఊహల్లో నువ్వే కనిపిస్తావు, నువ్వే నివసిస్తావు.
చంద్రుడైనా మాసానికోసారే పరిపూర్ణంగా కనిపిస్తాడు
నువ్వుంటే చాలు ప్రతి క్షణం నేను పరిపూర్ణుడినే అవుతాను.
ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం
ఏ కాలమైనా సరే ఓ నాలుగు నెల్లుండిపోతుంది
కష్టకాలం, ఇష్టకాలం ఏ కాలమైనా సరే
అన్ని కాలాల పాటు నేను నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
పుట్టిన ప్రతీది చావాల్సిందే
ఒక్కసారే పుట్టినా నేను చచ్చేంతవరకు చావనిది నీపై నా ప్రేమొక్కటే.

నిన్ను గెలిపించేందుకు తాను ఓడేవాడు ఒక్కరైనా ఉంటే ఆ ఒక్కరు నేనే.

నిన్ను గెలిపించేందుకు ఓడేవారు చాలామంది ఉంటే, అందులో మొదటి వ్యక్తిని నేనే 

ఈ జీవితం నీది నిన్ను వదిలేస్తే జీవితాన్ని వదిలేసినట్టే.
నిన్ను మర్చిపోతే జీవితాన్ని మరిచినట్టే

నువ్వు బ్రతికిననంతకాలం నీకు బ్రతుకునిస్తా
నువ్వు చస్తే నిన్ను బ్రతికిస్తా..

నీ సంతోషానికి అవసరమైతే చావునైనా ప్రేమిస్తా…
నీ కన్నీటికి కారణమైతే ప్రేమనైనా ద్వేషిస్తా………
నాకు తెలిసినంతవరకు ప్రేమంటే నీ సంతోషమే….

నువ్వు సంతోషంగా ఉండేందుకు చావుకైనా సిద్ఢమే.

కొన్నింటికి కారణాలు కావాలి
కాని నువు నాతో ఉంటే నా సంతోషానికి ఇంకే కారణం అక్కర్లేదు.

నిరంతరం నిన్ను నాలో చూస్తూనే ఉన్నా

నన్ను నీలో చూసుకునే క్షణం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా….

నా జీవితమనే పుస్తకంలో ప్రతి పేజీ నేదే
నా జీవితమనే పుస్తకంలో ప్రతి అక్షరం నువ్వే.

నా ఊపిరి…

Standard

ఈ జన్మకి నిను కలిసాను

నీ లోనే నను మరిచాను

నేనెవరో తెలిసేలోపే 

నీలో కనుమరుగయ్యాను

నా పుట్టుక జరిగినరోజే 

నీతో జత రాసుందేమో

నిన్నే నే కలిసేవరకు

నేనెవరో తెలియనే లేదు

ఈ మట్టిపై నే నడిచినరోజే 

మన మనసులు ముడిపడ్డాయేమో

అదే మట్టిలో నే కలిసేవరకు

నా ఊపిరి అర్థం నీవే

You are the one…

Standard

You are the one who made my life full,

You are the one too who made my life empty.

The former is true, when you came into my life,

The latter is true, when you left me alone.

You are not the one who just came to this earth on one day

And who leave this earth on some other day

Do you know that

You are totally different from all those

You are my life

You must know this

In fact

You are my everything dear….

చిన్నమాట-3

Standard

ఇంకొకరి సంతోషం కోసం మన సంతోషాన్ని వదులుకోవడం త్యాగం అన్నారు……

ఇంకొకరి సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవడం ప్రేమ అంటాను నేను…..

ఒక చిన్నమాట-2

Standard

మనసును తడిపేవి కొన్ని

మైమరపింపజేసేవి మరికొన్ని

తీయనైన  జ్ఞాపకాలు కొన్ని

చేదనిపించే క్షణాలు మరికొన్ని

ప్రతి ఒక్కరి  జీవితంలో ఉండేవే ఇవన్నీ…

ఒక చిన్నమాట-1

Standard

కమ్మని క్షణాలంటే 

మనకి నచ్చిన వారితో ఉన్న క్షణాలు

లేదా 

మనసుకు నచ్చిన వారి జ్ఞాపకాలతో ఉన్న క్షణాలు.

చేరని తీరం కోసం…

Standard

ముద్దులొలికే పసిపాప చిరునవ్వుని

 

అలసిన మనసును తాకే వర్షపు తుంపరలని

 

ముఖాన్ని స్పృశించే చల్లని ఎదురు గాలిని

 

ఎవరు మాత్రం వద్దనగలరు….

 

Continue reading

అమ్మంటే …అన్నీ…

Standard

అమ్మ… ఓ అనుభూతి…..
అది అనుభవిస్తేనే తెలుస్తుంది.
అమ్మంటే అనురాగం, ఆప్యాయత…
అమ్మ నీ కోసం చేసే ప్రతి పనిలో అది తెలుస్తుంది.
అమ్మంటే అనునయం.. అమ్మంటే ఆత్రుత…
అది నీకై చూసే కళ్ళలో ఉంటుంది.

Continue reading